న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న బాదితులు...!
..
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం....
రంపచోడవరం..
నర్సాపురం, దిరిసిన పల్లి గ్రామాల పరిధిలో గల నల్ల రాయి క్వారీల వలన తమ ఇల్లు పాడైపోతున్నాయని , విచ్చలవిడిగా బ్లాస్టింగ్ జరగటం వలన దుమ్ము దూళి, పంట పొలాలు నాశనం అవ్వటం, భూమి అదరటం వలన ఇల్లు టీవీలు పాడవటం జరుగుతున్నాయని,పర్యావరణ కాలుష్యం వలన ఆరోగ్యం పాడవుతున్నాయని దిరిసిన పల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవాని తో పాటు కొంతమంది బాధితులు కలిసి నవంబర్ 17వ తారీఖున రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి ఫిర్యాదు చేసినందుకు క్వారీ నిర్వహకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది దిరసనపల్లి గ్రామ పెద్దలు బాధిత ఫిర్యాదు దారులను బెదిరించి భయపెట్టి తెల్ల పేపర్ల మీద సంతకం చేసి బాధితులు మాట్లాడకుండా చేశారు. అయితే బల్లెం గంగా భవాని కుటుంబం మాత్రం తమ సమస్యలపై పరిష్కారం లభించే వరకు పోరాటం చేస్తామని ధైర్యంగా నిలబడి ఇప్పటికి పోరాటం చేస్తూనే ఉన్నారు. గతంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించిన కొంతమంది గ్రామ పెద్దలు , 20వేల రూపాయలు జరిమానా కట్టాలని గంగా భవాని కుటుంబాన్ని బెదిరించడం మానసికంగా హింసిస్తూ దాడులకు తెగబడ్డరు , అలాగే నవంబర్ 19వ తేదీ నాడు గ్రామం నుండి వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించడం జరిగింది, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో, ఐటిడిఎ లో, జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ గారికి, పలుమార్లు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేదు. దీనిపై బాధితురాలు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ న్యూ డిల్లీ కు ఫిర్యాదు చేయటంతో స్పందించిన కమిషన్ సంఘటనపై 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు పోస్ట్ ద్వారా అందుకున్న బల్లెం గంగాభవాని కుటుంబం ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. స్థానిక పోలీస్, ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ , మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తపరిచారు. విచారణ పేరుతో వచ్చిన రంపచోడవరం ఎమ్మార్వో, మైనింగ్ ఏడి పాడేరు వారు నవంబర్ 24వ తేదీన తమ కుటుంబంపై తమకు అండగా నిలిచిన ఆదివాసి నాయకులపై ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని, ఈ విషయంపై కూడా జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఉన్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు..
(పోలవరం జిల్లా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్)
మరో కథనంతో మళ్లీ కలుద్దాం...
--లోవరాజు...
మేటి అమరావతి పోలవరం జిల్లా ఇంచార్జి....
Let’s join with us…