మైనింగ్ మాఫియా తో మైనింగ్ అధికారుల మిలాఖత్.!
..
ఆదివాసి సంక్షేమ పరిషత్ మండిపాటు.
ఫిర్యాదులకు తప్పుడు నివేదికలు..
పోలవరం జిల్లా గంగవరం మండలం ఒజుబంద గ్రామంలో గల నల్లరాయి క్వారీల ముసుగులో గ్రామాల మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. ఇది తెలుసుకున్న ప్రజలు అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ లోడ్ లారీలను అడ్డుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికే నల్లరాయి క్వారీల తోటి అనేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లు పాడవుతున్నాయి, పంట పొలాలు నాశనం అవుతున్నాయి, ఇల్లు బీటలు వారుతున్నాయి, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అడవి అంతరించిపోతుంది వీటన్నిటిపై పిఓకి కలెక్టర్ కి మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారు క్వారీ నిర్వాహకులకు కొమ్ము కాస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు. తక్షణమే అధికారులు స్పందించి క్వారీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా మాట్లాడుతూ. ఓజబందులో గల నల్లరాయి క్వారీల పై ప్రజలు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉన్నత స్థాయి అధికారులు కూడా ఫిర్యాదు చేసి ఉన్నామని, అయితే దీనిపై మైనింగ్ ఏడికి క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా ప్రజలతో మాట్లాడకుండా తానొక్కరే టూరిస్ట్ లాగ వచ్చి క్వారీ దగ్గర ఫోటో తీసుకుని సైలెన్స్ గా వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. ఆ ఫోటో పెట్టి స్థానికంగా అంత బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదంటూ, ఉన్నత అధికారులకు తప్పుడు నివేదికలు అందజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మైనింగ్ ఏడి వలన ఏజెన్సీ లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రంప ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా మైనింగ్ మాఫియా రెచ్చిపోవడానికి కారణం, మైనింగ్ ఏడి అస్తమేనని ఆయన ఆరోపించారు. రంపచోడవరం మండలం నరసాపురం లో గల నల్లరాయి క్వారీల పై కూడా ఇలాగే తప్పుడు నివేదికలు ఇస్తూ మైనింగ్ మాఫియాని పెంచి పోషిస్తూ నష్టపోతున్న రెండు గ్రామాల ప్రజలకు అన్యాయం చేస్తూ వస్తున్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. వీటన్నిటి పై పలుమార్లు కలెక్టర్ ఐటిడిఏ గ్రీవెన్స్ లలో ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పాత చింతకాయ పచ్చడి లాగానే ఇచ్చిన రిపోర్ట్ ని తిరిగి ఇస్తూ కాలం గడిపేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రంప నియోజకవర్గంలో నడుస్తున్న అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కు అండగా అక్రమ మైనింగ్ మూసివేసే వరకు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని, తప్పుడు కేసులు పెట్టిస్తూ, ఫిర్యాదుదారులను బెదిరింపులకు గురిచేస్తు దాడులు చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియాకు, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు, దీని వెనక ఉన్న రాజకీయ నాయకుల కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై సోమవారం నాడు ఐటిడిఏ ముట్టడిసేపడతామని ఆయన తెలియజేశారు.
(పోలవరం జిల్లా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్)
మరో కథనంతో మళ్లీ కలుద్దాం...
--లోవరాజు...
మేటి అమరావతి పోలవరం జిల్లా ఇంచార్జి....
Let’s join with us…